శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 16:55:44

బిల్ గేట్స్ తండ్రి హెన్రీ గేట్స్ కన్నుమూత

బిల్ గేట్స్ తండ్రి హెన్రీ గేట్స్ కన్నుమూత

వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తండ్రి హెన్రీ గేట్స్ (94) కన్నుమూశారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న హెన్రీగేట్స్ మంగళవారం సాయంత్రం చనిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు. అతను 1925 నవంబర్ 30 న వాషింగ్టన్ లోని బ్రెమెర్టన్ లో జన్మించాడు. అతడిరి కుమారుడు బిల్ గేట్స్ తో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 

బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ స్థాపనలో హెన్రీ గేట్స్ కీలకంగా వ్యవహరించారు. ఆయన కారణంగానే ఈ ఫౌండేషన్ ద్వారా బాలల రోగనిరోధక శక్తిని పెంచడానికి, పోలియో నిర్మూలనకు, ఆఫ్రికన్ రైతులకు విత్తనాలు అందించడానికి, అమెరికన్ ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడానికి 50 బిలియన్ డాలర్లకు పైగా నిధులు అందజేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో కూడా ఈ ఫౌండేషన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.ః

నా తండ్రి జ్ఞానం నుంచి నేర్చుకోవడం ఏనాడూ ఆపలేదు: బిల్ గేట్స్ 

తన తండ్రి సుదీర్ఘమైన, అర్ధవంతమైన జీవితాన్ని గడిపారు. ఆయన మరణం మా కుటుంబానికి తీరని నష్టం" అని ఒక బ్లాగ్ పోస్ట్‌లో గేట్స్ రాశారు. అలాగే, “నేను అతడి జ్ఞానం, దయ,  వినయం నుంచి నేర్చుకోవడం ఏనాడూ ఆపలేదు. మెలిండా, నేను అతనికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే సమాజానికి, ప్రపంచానికి సేవ చేయాలనే అతని నిబద్ధతే మాకు దాతృత్వాన్ని ప్రేరేపించడానికి సహాయపడింది”అని గేట్స్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.


logo