శుక్రవారం 22 జనవరి 2021
International - Nov 27, 2020 , 18:46:03

వంట చేయడంమంటే నాకు చాలా ఇష్టం: కమలా హారీస్

 వంట చేయడంమంటే నాకు చాలా ఇష్టం: కమలా హారీస్

హైదరాబాద్ :అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన కమాలా హారీస్ తనకు వంట చేయడం చాలా ఇష్టమని చెబుతున్నారు. చెప్పటమే కాదు.. థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా.. స్వయంగా తాను చేసిన ఓ వంటకాన్ని సోషల్ మీడియా వేదికగా కమలా పంచుకున్నారు. ఆ వంటకం వాళ్ల కుటుంబంలో అందరికీ చాలా ఇష్టమైన థాంక్స్ గివింగ్ రెసిపీ అట.

కరోనా కారణంగా.. వంట గదిలో ఎక్కువ సమయం గడిపానని కమలా తన ఇనస్టాగ్రామ్    ఖాతా ద్వారా తెలిపారు. "ఈ సంవత్సరం థాంక్స్ గివింగ్ హాలిడే సందర్భంగా.. నేను మా ఇంట్లో అందరికీ నచ్చిన కార్న్‌బ్రెడ్ డ్రెస్సింగ్(వంటకం) ను మీకు పరిచయం చేస్తున్నాను" అంటూ.. ఆ వంటకం తయారీని కమలా తన ఇనస్టాగ్రామ్ లో స్టెప్ బై స్టెప్ చూపించారు.

దీంతో పాటుగా.. కార్న్‌బ్రెడ్ డ్రెస్సింగ్ రెసిపీను మీరు మీ జీవితంలో ఎప్పుడు చేయాలనుకున్నా.. కచ్చితంగా అది చేసినప్పుడు, నాకు కలిగిన అనుభూతులే మీకూ కలుగుతాయి.. అంటూ కమలా పోస్ట్ చేశారు. కమలా చేసిన కార్న్‌బ్రెడ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే.. కార్న్ బ్రెడ్ మిక్స్, స్పైసీ పోర్క్ సాసేజెస్, ఆనియన్స్, యాపిల్స్, సెలిరీ స్టాక్స్, చికెన్ బ్రోత్, అన్ సాల్టెడ్ బటర్, ఫ్రెష్ పార్సలే, సేజ్, థీమ్, రోజ్ మేరీ, సాల్ట్ అండ్ పెప్పర్. 

కమలా చేసిన కార్న్ బ్రెడ్ రెసిపీకి ఇప్పటివరకూ 2లక్షల లైకులు, షేర్లతో పాటు.. టన్నుల కొద్దీ కాంప్లిమెంట్లు వచ్చిపడ్డాయి. మీరు ఓ సారి ట్రై చేయండి. అమెరికాలో థాంక్స్ గివింగ్ హాలీడేను నవంబర్ నెలలో వచ్చే నాలుగో గురువారం రోజున జరుపుకుంటారు. ఈ రోజును చాలా రకాల వంటలు చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo