శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 11:29:37

ఆమె క‌న్నా నాకే భార‌తీయుల మ‌ద్ద‌తు ఎక్కువ: ట‌్రంప్‌

ఆమె క‌న్నా నాకే భార‌తీయుల మ‌ద్ద‌తు ఎక్కువ: ట‌్రంప్‌

హైద‌రాబాద్: అమెరికా ఎన్నిక‌ల కోసం ప్ర‌చారం హీటెక్కింది. డెమోక్ర‌టిక్ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థి క‌మ‌లా హారిస్‌పై.. అధ్య‌క్షుడు ట్రంప్ అటాక్ స్టార్ట్ చేశారు. బైడెన్ దేశంలో ఒక్క‌రు కూడా సేఫ్‌గా ఉండ‌ర‌ని ట్రంప్ అన్నారు.  ఇక కాలిఫోర్నియా సేనేట‌ర్ క‌మ‌లా హారిస్ ఎంపిక మ‌రింత చెత్త అడుగు అని విమ‌ర్శించారు.  ఒక‌వేళ జోసెఫ్ బైడెన్ అధ్య‌క్షుడైతే, ఆయ‌న త‌క్ష‌ణ‌మే పోలీసు వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేస్తార‌ని, ఇక క‌మ‌లా హారిస్ మ‌రింత చెత్త నిర్ణ‌యం తీసుకుంటార‌ని ట్రంప్ ఆరోపించారు. న్యూయార్క్ పోలీసు బెన‌వోలెంట్ అసోసియేష‌న్ స‌మావేశంలో మాట్లాడుతూ.. క‌మ‌లా హారిస్ క‌న్నా త‌న‌కు భార‌తీయుల‌ మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ట్రంప్ తెలిపారు. బైడెన్ మీ మ‌ర్యాద‌ను, గౌర‌వాన్ని దోచేస్తున్నారు, బైడెన్ అమెరికాలో ఎవ‌రూ సుర‌క్షితంగా ఉండ‌ర‌ని ట్రంప్ అన్నారు.   పోలీసుల‌కు జ‌ర‌గాల్సిన ఫండింగ్‌ను బైడెన్ అడ్డుకుంటున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.  logo