శనివారం 06 జూన్ 2020
International - Apr 27, 2020 , 16:55:39

నేను బాగానే ఉన్నా: కిమ్ సందేశం

నేను బాగానే ఉన్నా: కిమ్ సందేశం

న్యూఢిల్లీ: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్ మ‌ర‌ణించిన‌ట్టుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ మేర‌కు తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ కొరియాకు చెందిన ఒక‌ టీవీ ఛానెల్‌కు లిఖిత పూర్వక సందేశం పంపించారు. మ‌రోవైపు కిమ్ ఆరోగ్యంపై ఉత్తరకొరియా ప్రభుత్వం కూడా ఒక‌ ప్రకటన చేసింది. కిమ్ మరణించిన‌ట్లు వ‌స్తున్న‌ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కిమ్‌ భద్రతా సలహాదారు తెలిపారు. ప్రస్తుతం కిమ్ ఓ రిసార్ట్‌లో విడిదిలో ఉన్నార‌ని, అక్కడి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్నార‌ని ఆయన పేర్కొన్నారు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo