ఆదివారం 23 ఫిబ్రవరి 2020
ఇండియాకు వెళ్తున్నా : డోనాల్డ్ ట్రంప్

ఇండియాకు వెళ్తున్నా : డోనాల్డ్ ట్రంప్

Feb 15, 2020 , 09:28:12
PRINT
ఇండియాకు వెళ్తున్నా :  డోనాల్డ్ ట్రంప్

 హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. త‌న భార‌త ప‌ర్య‌ట‌న గురించి మ‌రోసారి ట్వీట్ చేశారు. మ‌రో రెండు వారాల్లో ఇండియాకు వెళ్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ఆ ప‌ర్య‌ట‌న గురించి ఎంతో ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ట్రంప్ తెలిపారు.  ఫేస్‌బుక్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న‌ట్లు దాని ఓన‌ర్ మార్క్ జూక‌ర్‌బ‌ర్గ్ చెప్పిన విష‌యాన్ని ట్రంప్ త‌న ట్వీట్‌లో గుర్తు చేశారు.  త‌న‌కు ఆ స్థానం ద‌క్క‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. అయితే ఎఫ్‌బీలో రెండ‌వ స్థానంలో ప్ర‌ధాని మోదీ ఉన్నార‌న్న అంశాన్ని కూడా ఆయ‌న త‌న ట్వీట్‌లో ప్ర‌స్తావించారు. వాస్త‌వానికి తాను కూడా ఇండియా టూర్‌కు వెళ్తున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.  ఈనెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్య‌క్షుడు ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్నారు.  న్యూఢిల్లీతో పాటు అహ్మ‌దాబాద్‌లో ఆయ‌న ప‌ర్య‌టిస్తారు.  మొతెరా స్టేడియంలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొననున్నారు.  


logo