గురువారం 28 మే 2020
International - Apr 27, 2020 , 14:45:32

బంగ్లాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు

బంగ్లాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను కంటిమీద కునుకు లేకుండాచేస్తోంది. కంటికి కనిపించని ఈ మ‌హ‌మ్మారికి విరుగుడు లేకపోవడంతో అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. ఉన్నంత‌లో మన దేశంలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు..ప‌ని చేస్తుండ‌టంతో ప్రపంచ దేశాల‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్ సంజీవినిగా మారింది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని 50 దేశాల‌కు పైగా ఈ మందుల‌ను మ‌న దేశం నుంచి ఎగుమ‌తి అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న పొరుగు దేశం కూడా  హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుల‌ను దిగుమ‌తి చేసుకుంది. కరోనాపై పోరులో భాగంగా  బంగ్లాదేశ్‌కు లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను భారత్‌ ప్రభుత్వం అందించింది. వాటితోపాటు 50 వేల సర్జికల్‌ గ్లౌజులను సైతం పంపించింది. కొవిడ్‌-19పై పోరులో సార్క్‌ అత్యవసర నిధిలో భాగంగా బంగ్లాకు భారత్‌ సహాయం అదించడం ఇది రెండోసారి. గతంలో హెడ్‌ కవర్లు, మాస్కులను కూడా భార‌త్ స‌ప్లై చేసింది.


logo