గురువారం 28 మే 2020
International - May 17, 2020 , 07:32:22

గల్ఫ్‌లో ఐక్యతని చాటి మానవత్వాన్ని చూపిన హైదరాబాదీలు

గల్ఫ్‌లో ఐక్యతని చాటి మానవత్వాన్ని చూపిన హైదరాబాదీలు

ఒమన్‌ : భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ అందం. ఈ విపత్కర కాలంలో ధైర్యం, విశ్వాసం, పరస్పర సహకారంతో కరోనాను ఎదుర్కొందామంటూ పలువురు పిలుపునిస్తున్నారు. దీనికి ఉదాహరణగా అన్నట్టు ఒమన్‌ దేశంలో జరిగిన ఓ ఘటనను టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ ఒమన్‌ శాఖ అధ్యక్షుడు మహిపాల్‌ రెడ్డి తెలిపారు. ఓ భారతీయుడు ఒమన్‌లో కోవిడ్‌-19 భారిన పడ్డాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గతవారం తుదిశ్వాస విడిచాడు. అయితే కరోనా మహమ్మారికి భయపడి బంధువులు కానీ, అతడి స్నేహితులు కానీ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలిసిన ఒమన్‌లోని ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌ వ్యాస్తవ్యుడు సోహైల్‌ఖాన్‌, క్లబ్‌ సభ్యులు సంజీత్‌ కనోజియా స్పందించి మృతుడి మత(హిందూ) సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించతలపెట్టారు. విషయాన్ని తమ బృంద సభ్యులకు తెలపగా ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌లోని డెక్కన్‌ వింగ్‌కి చెందిన ముగ్గురు హైదరాబాద్‌ యువకులు జాఫ్రీ, ఒబాయిది, తమిమ్‌లు ముందుకు వచ్చారు. వీరందరూ కలిసి హిందూ సాంప్రదాయం ప్రకారం మృతుడికి గౌరవంగా అంతిమ సంస్కరాలు పూర్తిచేశారు. మానవత్వానికి సూచికగా నిలిచిన ఈ ఘటనను, యువకులు చూపిన సాహసానికి అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.  logo