బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 12:30:33

అమెరికాలో ఈత‌కు వెళ్లి హైద‌రాబాదీ మృతి

అమెరికాలో ఈత‌కు వెళ్లి హైద‌రాబాదీ మృతి

న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు. మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. హైద‌రాబాద్‌కు చెందిన ఖాజా ఇమ్రాన్ ఖాన్ (23) సెయింట్ లూయిస్‌లోని సరస్సులో ఈతకు వెళ్లి అందులో మునిగిపోయాడు. వెంట‌నే స్నేహితులు అతడిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఖాజా కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా, అమెరికాకు వెళ్లేందుకు త‌మ‌కు ఎమర్జెన్సీ వీసా ఇప్పించాలని ఖాజా  తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.

ఖాజా ఇమ్రాన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి సెయింట్ లూయిస్‌లోని సరస్సులో ఈతకు వెళ్లాడు. కొంత సేపటి త‌ర్వాత ఖాజా క‌నిపించ‌కుండా పోయాడు. అనుమానం వచ్చిన స్నేహితులు చుట్టూ వెతకగా అతడు మునిగిపోతూ కనిపించాడు. వెంటనే వారు రెస్క్యూ టీమ్‌కు స‌మాచారం ఇవ్వ‌గా వ‌చ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. అమెరికాలో చ‌దువుకుంటున్న‌ కొడుకు చనిపోయాడ‌న్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌య్యారు. క‌రోనా కారణంగా విమానాలు లేకపోవడం, మృత‌దేహాన్ని భార‌త్‌కు తెచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే అంత్యక్రియలు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo