శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 29, 2020 , 02:08:50

కరోనా టీకా ఉత్పత్తిలో హైదరాబాద్‌ కంపెనీ!

కరోనా టీకా ఉత్పత్తిలో హైదరాబాద్‌ కంపెనీ!

  • 100 కోట్ల డోసులు తయారు చేయనున్న ‘బయలాజికల్‌ ఈ’ 
  • ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా సంస్థ 

హ్యూస్టన్‌: కరోనా టీకా ఉత్పత్తి కోసం అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బేలోర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసన్‌ (బీసీఎమ్‌) తెలంగాణ ఫార్మా కంపెనీ ‘బయలాజికల్‌ ఈ ’తో ఒప్పందం కుదుర్చుకున్నది. బీసీఎమ్‌ టీకా ప్రస్తుతం ట్రయల్స్‌ దశలో ఉన్నది. వచ్చే ఏడాదిలో టీకా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. టీకా తయారయ్యాక వేగంగా పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో బయోలాజికల్‌ ఈ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, బయలాజికల్‌ ఈ 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుందని బీసీఎమ్‌ అధికారులు తెలిపారు. బయలాజికల్‌ ఈ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నది.


logo