బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 27, 2020 , 11:41:47

అమెరికా తీరం దిశ‌గా హ‌రికేన్ లారా

అమెరికా తీరం దిశ‌గా హ‌రికేన్ లారా


హైద‌రాబాద్‌: అమెరికా తీరం దిశ‌గా హ‌రికేన్ లారా దూసుకువ‌స్తున్న‌ది.  గోల్ఫ్ కోస్ట్ తీరంలో హ‌రికేన్ బీభ‌త్సం సృష్టించే అవ‌కాశాలు ఉన్నాయి. తీవ్ర తుఫాన్ వ‌ల్ల జీవించ‌డం సాధ్యం కాని ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  బ‌ల‌మైన గాలులు వీస్తాయ‌ని, వ‌ర‌ద‌లు ప్ర‌ళ‌యం సృష్టిస్తాయ‌ని నేష‌న‌ల్ హ‌రికేన్ సెంట‌ర్ పేర్కొన్న‌ది.  హ‌రికేన్ లారా దూసుకువ‌స్తున్న నేప‌థ్యంలో క్యాట‌గిరీ 4 వార్నింగ్ జారీ చేశారు.

టెక్సాస్‌, లూసియానా రాష్ట్రాల దిశ‌గా హ‌రికేన్ ప‌యనిస్తున్న‌ది. దాదాపు 240 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.  ఒక‌వేళ తీరం తాకే స‌మ‌యంలో అదే స్పీడ్ ఉంటే.. ఇక హ‌రికేన్ అమెరికా ద‌క్షిణ  కోస్తా చ‌రిత్ర‌లో అత్యంత బ‌ల‌మైనదిగా నిలుస్తుంద‌ని వాతావ‌ర‌ణ నిపుణ‌నులు చెబుతున్నారు. సుమారు 5 ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. టెక్సాస్‌లోని తీర ప‌ట్ట‌ణం పోర్ట్ ఆర్ధ‌ర్‌కు 105 కిలోమీట‌ర్ల దూరంలో హ‌రికేన్ కేంద్రీకృత‌మై ఉన్న‌ది.  logo