శనివారం 30 మే 2020
International - Apr 28, 2020 , 14:38:18

ఆకలి చావుల రూపంలో మరో విపత్తు

ఆకలి చావుల రూపంలో మరో విపత్తు

న్యూయార్క్‌: క‌రోనా ఇప్పుడు ప్రపంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. 30ల‌క్ష‌ల మందికి పైగా దీని బారిన ప‌డ‌గా..మ‌ర‌ణాలు రెండుల‌క్ష‌ల‌కు పైగా న‌మోద‌య్యాయి. ఈ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ఆగ‌క‌పోతే ప్రపంచానికి మ‌రో పెద్ద ముప్పు పొంచి ఉంది. ఆక‌లి చావుల రూపంలో ముంచుకురానుంది. కరోనా మహామ్మారి విజృంభణ ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలో ఆకలి చావులు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని వరల్డ్‌ పుడ్‌ ప్రోగ్రామ్ ప్ర‌తినిధులు హెచ్చరించారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ను పాటిస్తున్న క్ర‌మంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నార‌ని పేర్కొన్నారు. 

అలాంటి వారిని ఆదుకోకపోతే ఆక‌లి కేక‌లు త‌ప్ప‌వ‌ని సూచించారు. ఇప్పటికే పేద దేశాల్లో ఆక‌లితో అల‌మ‌టిస్తున్నార‌ని..ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు ఐక్య‌రాజ్య‌స‌మితికి ఇచ్చే నిధుల్లో కోత విధించడం స‌రికాద‌న్నారు. అటు వరల్డ్‌ పుడ్‌ ప్రోగ్రామ్ ద్వారా 10 కోట్ల మందికి ఆహరాన్ని అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులో 3 కోట్ల మంది కేవలం తామిచ్చే ఆహారంపై ఆధారపడ్డారని.. వీరికి సమయానికి ఆహరాన్ని అందించకుంటే చాలా నష్టం జరుగుతుందని చెప్పారు.logo