శనివారం 04 జూలై 2020
International - Jun 06, 2020 , 16:24:46

ఐఫోన్లే టైల్స్‌గా మారాయి!

ఐఫోన్లే టైల్స్‌గా మారాయి!

చేతిలో ఐఫోన్‌ ఉంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్లుగా భావిస్తుంటాం. అంలాంటిది ఇటుకలకు బదులు ఐఫోన్లతో ఇంటి ప్రహరీ కట్టారంటే వాళ్లని పాతకాలంలో రాజులుగా భావించడంలో తప్పులేదు. ఐఫోన్లతో గోడకట్టిన వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. అయితే ఇందులో వాస్తవం ఉండకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

టిక్‌టాక్‌లో పాపులారిటీ కోసం యువత ఎంతకైనా తెగిస్తున్నారు. నిజాన్ని అబద్ధం. అబద్ధాన్ని నిజం చేస్తున్నారు. ఇది కూడా అలాంటిదే అయింటుంది అనుకుంటే పొరపాటే. ఈ వీడియోను బాగా పరిశీలించినట్లయితే అన్నీ ఐఫోన్లే. టైల్స్‌లా కనిపిస్తున్న ఆ మొబైల్స్‌ ఐఫోన్‌-6 మోడల్‌కు చెందినవి. వీటిని ఆపిల్‌ సంస్థ ఎప్పుడో నిలిపివేసింది. ఇప్పుడు వాటి అప్‌డేట్స్‌ కూడా రావడం లేదు. ప్రస్తుతం ఈ మోడల్స్‌ను వాడుతున్న వాళ్లు పాత ఫీచర్స్‌నే వాడుతున్నారు. ఇక ఆ ఫోన్లన్నింటినీ ఏం చేయాలో తెలియక ఇలా ప్రహరీ గోడ కట్టినట్టు ఉన్నాడు వియాత్నంకు చెందిన టిక్‌టాక్‌ యూజర్‌. ఒకటి, రెండు కాదు కొన్ని వందల ఫోన్లను గోడగా మార్చేశాడు. ‘ఇతనికి ఇన్ని ఐఫోన్లు ఎలా వచ్చాయి’. ‘ఆపిల్‌ సంస్థ నిలిపివేయడంతో స్టాక్‌ ఉన్న వాళ్లందరి నుంచి కొనుగోలు చేసి ఇలా చేసి ఉండొచ్చు’. ‘ఏదైతేనేం ప్రహరీ లుక్‌ మాత్రం అదిరింది’. ‘ఈ వీడియో వెనుక దాగున్న అసలు నిజం అతనికే తెలియాలి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు వీడియోను 1.7 మిలియన్ల మంది వీక్షించారు.
logo