గురువారం 09 ఏప్రిల్ 2020
International - Feb 04, 2020 , 00:48:26

మనుగడ కోసమే మట్టికుండల సృష్టి!

మనుగడ కోసమే మట్టికుండల సృష్టి!

లండన్‌: మానవజాతి చరిత్రలో మట్టికుండల ఆవిష్కరణకు సంబంధించిన ఓ చిక్కుముడి వీడింది. మానవులు ఆహార పదార్థాలను వండుకోవడానికి మొదట మట్టి కుండలను తయారుచేసుకున్నారు. అయితే మొదటగా ఎక్కడ ఈ తయారీ జరిగిందో మాత్రం ఇప్పటికీ తేలలేదు. దీనికి సంబంధించి తాజాగా బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌ పరిశోధకులు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ‘క్వాంటర్నరీ సైన్స్‌ రివ్యూస్‌' జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసం ప్రకారం.. రష్యాలో దొరికిన అనేక మట్టికుండల ఆనవాళ్లను పరిశోధించగా అవన్నీ 16వేల నుంచి 12వేల ఏండ్ల కిందటివిగా గుర్తించారు. అందులోని ఆహారపు అవశేషాలను విశ్లేషించగా.. అప్పటి సైబీరియన్‌ వేటగాళ్లు ఈ కుండల్లో మాంసం ఉడికించినట్టు నిర్ధారించారు. చలి ప్రాంతాల్లో మంసాన్ని వేడిగా ఉంచుకోవడానికి ఉష్ణ నిరోధక కుండలను ఉపయోగించినట్టు తేల్చారు. ఇదే కాలంలో జపాన్‌తోపాటు ఈశాన్య ఆసియాలోని పలు చోట్ల మట్టి కుండలను తయారు చేసినట్టు తేలింది. అవసరాలే వారిని ఒకే సమయంలో మట్టి కుండలు ఆవిష్కరించేలా చేశాయని చెప్పారు. 

logo