సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 11, 2020 , 18:48:49

మలేషియాలో మానవ ముఖం చేపలు

మలేషియాలో మానవ ముఖం చేపలు

ప్రపంచం మొత్తం ఆశ్చర్యాలతో నిండి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యే విషయం ఒకటి మలేషియాలో వెలుగులోకి వచ్చింది.  మలేషియాలోని ఒక గ్రామానికి సమీపంలో ఉన్న నదిలో మానవ ముఖం కలిగిన చేప ఒకటి వలకు చిక్కింది. ఈ చేప లక్షణాలు మానవుల మాదిరిగా ఉండి పెదవులు, దంతాలను కలిగివుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ చేప చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చూసినవారంతా షాక్ అవుతున్నారు. 

ఈ చేపను ట్రిగ్గర్ ఫిష్ అని పిలుస్తారని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఆగ్నేయాసియా జలాల్లో ఇలాంటిచేపలు ఎక్కువగా కనిపిస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇంతకు ముందు ఇలాంటి చేపలు లండన్, దక్షిణ చైనాలో కూడా బయటపడ్డాయంట. లండన్లో దొరికిన చేపలకు రెండు కళ్ళు, ముక్కు, మానవుడిలా నోరు ఉన్నాయంట. అదే సమయంలో దక్షిణ చైనాలో దొరికిన చేపల ముఖం కూడా మానవుడిలా ఉన్నదంట. 

మలేషియాలో మానవ ముఖంలాంటి చేపల ఫొటోల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజెన్లు వాటిని వివిధ ఆకారాల్లో మీమ్స్ జోడించి తీర్చిదిద్దుతూ పోస్ట్ చేస్తున్నారు. మీరు వాటిని కూడా తిలకించవచ్చు.logo