శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 12:30:54

విమానం అంచున‌ కూర్చొని ఫొటోషూట్ చేస్తున్న ఫొటోగ్రాఫ‌ర్ : వీడియో వైర‌ల్‌

విమానం అంచున‌ కూర్చొని ఫొటోషూట్ చేస్తున్న ఫొటోగ్రాఫ‌ర్ :  వీడియో వైర‌ల్‌

90వ నేషనల్ డే ఆఫ్ సౌదీ అరేబియా వేడుకలను పురస్కరించుకొని ఇటీవల రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్-షో రిహార్సల్స్ చేశాయి. దీనికోసం ఫొటోగ్రాఫ‌ర్ త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. వృత్తి ప‌ట్ల‌, గౌర‌వం, డెడికేష‌న్‌, నిబ‌ద్ధ‌త‌ను చాటుకున్నారు. ఈ ఫొటోగ్రాపర్‌ను చూస్తే తోటి ఫొటోగ్రాఫ‌ర్ల‌కు కూడా అసూయపుట్టే విధంగా ప‌నిచేశారు. ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా ఆర్మీ విమానం వెనుక‌వైపు తెరిచి ఉన్న ర్యాంప్ డోర్ వ‌ద్ద కూర్చొని వెనుక వ‌స్తున్న ఫైట‌ర్ జెట్ విమానాల‌కు ఒక ఫొటోగ్రాప‌ర్ ఫొటోషూట్ చేస్తున్నాడు.

మ‌నుషుల‌కు ఎలా అయితే డైరెక్ష‌న్స్ ఇస్తారో విమానాల‌కు కూడా అలానే ఇస్తున్నాడు. 'కొంచెం ఇటు జ‌రుగు, నువ్వు కింద‌కి వంగు, నువ్వు సైడ్‌కి జ‌రుగు' అనే సంజ్ఞ‌ల‌ను వెనుక వ‌స్తున్నపైలెట్ల‌కు చేతుల‌తో సంజ్ఞ చేస్తున్నాడు. పైలెట్లు కూడా ఫొటోగ్రాఫ‌ర్ల‌ను అనుస‌రిస్తూ న‌డుపుతున్నారు. మొత్తానికి అత‌నికి కావాల్సిన విధంగా ఫొటోషూట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. వీరి ధైర్యానికి నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. 


logo