శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 21, 2020 , 14:29:31

క‌రోనా సంక్షోభం.. వారెన్ బ‌ఫెట్ న‌ష్ట‌మెంత ?

క‌రోనా సంక్షోభం..  వారెన్ బ‌ఫెట్ న‌ష్ట‌మెంత ?

హైద‌రాబాద్‌:  క‌రోనా వ‌ల్ల మార్కెట్ కింగ్ వారెన్ బ‌ఫెట్ భారీగా న‌ష్ట‌పోయారు. ఆయ‌న‌కు చెందిన బెర్క్‌షైర్ హ్యాత్‌వే కంపెనీ సుమారు 70 బిలియ‌న్ల డాల‌ర్లు న‌ష్ట‌పోయిన‌ట్లు తెలుస్తోంది.  యాపిల్‌, బ్యాంక్ ఆఫ్ అమెరికా, కోకాకోలా లాంటి కంపెనీలు ఉన్న బ‌ఫెట్ షేర్లు కూడా గ‌త కొన్ని వారాలుగా ఘోర ప‌త‌నాన్ని చ‌విచూశాయి.  ఆర్థిక సంక్షోభం వ‌ల్ల బ్యాంక్ ఆఫ్ అమెరికా ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉన్న‌ది.  విమానాల ప్ర‌యాణాలు ర‌ద్దు కావ‌డంతో డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఉన్న బెర్క్‌షైర్ షేర్లు కూడా ప‌త‌న‌మ‌య్యాయి. ఈనెల 23వ తేదీ నుంచి న్యూయార్క్ స్టాక్ మార్కెట్లు ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ నిర్వ‌హించ‌నున్నాయి. స్టాక్  ఎక్స్‌చేంజ్‌లో ప‌నిచేసే ఇద్ద‌రు ఉద్యోగుల‌కు వైర‌స్ సోక‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. logo