శనివారం 31 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 02:30:38

మండలిలో మాకు చోటెప్పుడు? : మోదీ

మండలిలో మాకు చోటెప్పుడు? : మోదీ

ఐరాస: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వానికి ఇంకెంతకాలం దూరంగా ఉంచుతారని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఈ మేరకు ఐరాస సర్వసభ్య 75వ వార్షిక సమావేశంలో శనివారం ఆయన ఆన్‌లైన్‌ వేదికగా మాట్లాడారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పారు.