మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 12, 2020 , 14:16:57

వామ్మో.. కేవ‌లం 3 నిమిషాల్లో 10 జామ్ డోన‌ట్స్‌ను తిన్న మ‌హిళ‌

వామ్మో.. కేవ‌లం 3 నిమిషాల్లో 10 జామ్ డోన‌ట్స్‌ను తిన్న మ‌హిళ‌

సాధార‌ణంగా ఒక మ‌నిషి జామ్ డోన‌ట్స్ ఎన్ని తిన‌గ‌ల‌రు. మ‌హా అయితే మూడు, నాలుగు. లేదంటే ఐదు తింటారేమో. కానీ ఈ మ‌హిళ మాత్రం ఏకంగా ప‌ది జామ్ డోన‌ట్స్ తినేసింది. అంది కూడా కేవ‌లం మూడు నిమిషాల వ్య‌వ‌ధిలోనే. అందుకే ఈ మ‌హిళ గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్న‌ది. ఇంగ్లాండ్‌కు చెందిన లేహ్ ష‌ట్‌కెవ‌ర్‌ను 'కాంపిటేట‌ర్ ఈట‌ర్' అని పిలుస్తుంటారు. ఈమె ఇప్ప‌టికే ఏడు గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ టైటిల్స్‌ను క‌లిగి ఉంది.

ఇటీవ‌ల జామ్ డోన‌ట్స్‌తో మ‌రో రికార్డ్ సంపాదించుకున్న‌ది. 4 నిమిషాల 35 సెకండ్ల వ్య‌వ‌ధి ఉన్న వీడియోలో లేహ్ ష‌ట్కేవ‌ర్ ఎదురుగా రెండు ప్లేట్ల‌లో ప‌ది జామ్ డోన‌ట్స్‌ను అమ‌ర్చి ఉంది. వెనుకవైపు కౌంట్‌డౌన్ టైమ‌ర్ న‌డుస్తుంది. టైం స్టార్ట్ అవ్వ‌గానే లేహ్ తిన‌డం ప్రారంభించింది. ఇందులో మ‌రొక నియ‌మం ఏంటంటే.. డోన‌ట్స్ తినేట‌ప్పుడు ఆమె పెదాల‌ను క‌దిలించ‌డానికి కూడా అనుమ‌తిలేదు. ఇవ‌న్నీ పాటిస్తూనే 3 నిమిషాల వ్య‌వ‌ధిలో ప‌ది జామ్ డోన్స‌ట్స్ తిని గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకున్న‌ది.  logo