బుధవారం 03 జూన్ 2020
International - May 11, 2020 , 19:31:34

లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌.. హోట‌ళ్లు ధ్వంసం

లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌.. హోట‌ళ్లు ధ్వంసం

హైద‌రాబాద్‌: నైజీరియాలో లాక్‌డౌన్ నియ‌మాల‌ను ఉల్లంఘించిన రెండు హోట‌ళ్ల‌ను ధ్వంసం చేశారు. ఆ రెండు హోట‌ళ్ల మేనేజ‌ర్ల‌ను కూడా అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న స‌ద‌ర్న్ రివ‌ర్స్ స్టేట్‌లో జ‌రిగింది. అయితే తాము లాక్‌డౌన్ రూల్స్ పాటించిన‌ట్లు హోట‌ల్ య‌జ‌మానులు చెబుతున్నారు. హోట‌ల్ వ‌ల్ల‌ ఇన్‌ఫెక్ష‌న్లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ చ‌ర్య తీసుకున్న‌ట్లు రివ‌ర్స్ స్టేట్ గ‌వ‌ర్న‌ర్ నీస‌మ్ వైక్ తెలిపారు. ఇక ఆఫ్రికా దేశ‌మైన జాంబియా..త‌న స‌రిహ‌ద్దు దేశం టాంజానియాతో బోర్డ‌ర్‌ను మూసివేసింది. టునీషియాలో మ‌ళ్లీ మార్చి నెల త‌ర్వాత కొత్త‌గా కేసులు న‌మోదు అయ్యాయి. ప్ర‌స్తుతం బురుండీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఎన్నిక‌ల అధికారుల‌కు క‌చ్చితంగా 14 రోజుల క్వారెంటైన్ రూల్ పెట్టారు. మ‌రో 9 రోజుల్లో అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రో ఏడాది పాటు క‌రోనా రోజుల్ని గ‌డ‌పాల్సి ఉంటుంద‌ని ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడు సిరిల్ రామ‌ఫోసా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు.  సోష‌ల్ డిస్టాన్సింగ్, మాస్క్‌లు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అన్నారు.


logo