శనివారం 30 మే 2020
International - May 23, 2020 , 03:18:40

హోటళ్లలో హోషియార్‌

హోటళ్లలో హోషియార్‌

 • పలు దేశాల్లో తెరుచుకున్న హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు 
 • కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు
లండన్‌/రోమ్‌: కరోనావైరస్‌తో సహజీవనం చేస్తూనే ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలతోపాటు ప్రజలు, పరిశ్రమలు సంస్థలు కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటలీ వంటి పలు దేశాల్లో బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్‌లు తెరుచుకున్నాయి. బ్రిటన్‌లో జూలై 4 నుంచి పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. అదేసమయంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిబంధనలను రూపొందించాయి. వాటిల్లో కొన్ని..

పబ్‌లు.. రెస్టారెంట్లు 

 • శానిటైజర్‌/హ్యాండ్‌వాష్‌తో  చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే వినియోగదారులను లోనికి అనుమతిస్తారు. 
 • కస్టమర్లు నేరుగా టేబుల్‌ వద్దకే వెళ్లేలా నేలపై ప్రత్యేక మార్కింగ్‌. లేదా వెయిటర్‌ స్వయంగా తీసుకెళ్తారు. 
 • నిర్ణీత దూరం కోసం రెండు టేబుళ్ల మధ్య రెండు మీటర్ల దూరం తప్పనిసరి. 
 • కస్టమర్లు ఒకరినొకరు తాకకుండా టేబుల్‌పై మధ్యలో స్క్రీన్‌/షీట్‌ ఏర్పాటు. 
 • సాల్ట్‌, పెప్పర్‌ డబ్బాలు, కచప్‌, సాస్‌ సీసాల తొలిగింపు. వీటిని ఆహారంతోపాటే చిన్న ప్యాకెట్లలో సరఫరా చేస్తారు. 
 • సెల్ఫ్‌ సర్వీస్‌ ఉండదు. ‘బఫే’లు బంద్‌. 
 • సిబ్బంది, వినియోగదారులు ఎక్కువ వస్తువులను ముట్టుకునే అవకాశం ఇవ్వకుండా ఆహార పదార్థాల సంఖ్యను (మెనూ) తగ్గించడం. 
 • మెనూ కార్డ్‌ బదులు.. వినియోగదారుడి ఫోన్‌కు టెక్స్‌ మెసేజ్‌ లేదా ఫొటో రూపంలో మెనూ పంపడం, 
 • బార్లలో టేబుల్‌ సర్వీస్‌ మాత్రమే ఉంటుంది. లిక్కర్‌ కౌంటర్‌ వద్ద నిలబడి తాగడంపై నిషేధం విధించడం. 
 • డిజిటల్‌ పేమెంట్స్‌కు ప్రాధాన్యం. బేరర్లకు నగదు టిప్‌లపై నిషేధం. 
 • వినియోగదారుడు వెళ్లిపోగానే టేబుల్‌ను శాటిటైజ్‌ చేయడం. 

హోటళ్లు 

 • షేక్‌హ్యాండ్‌ స్వాగతాలకు స్వస్తి.. ‘నమస్తే’ వంటివాటికి ప్రాధాన్యం. 
 • ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలన్నీ గదికే పంపిస్తారు. ‘బఫే’లు బంద్‌. 
 • ఆరుబయట జిమ్‌, స్పా వంటివి నిషేధం. గదుల్లోనే చేసుకోవాలి. 
 • కరోనా అదుపులోకి వచ్చేవరకు స్విమ్మింగ్‌ ఫూళ్ల వాడకంపై నిషేధం. 
 • అతిథుల కోసం గతంలో పెన్ను, పేపర్లు, సబ్బులు, టవళ్లు వంటివి ఏర్పాటు చేసేవారు.
 • ఇలాంటి ‘ఉచిత’ సేవలను వీలైనంత తగ్గించడం.  
 • సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, ఫేస్‌ షీల్డ్‌ తప్పనిసరి. 
 • గది ఖాళీ అయిన వెంటనే శుద్ధి చేయడం. ఆ తర్వాతే మరొకరికి కేటాయించడం.
 • రూమ్‌ తాళం చెవులను సైతం శుద్ధి చేయాలి. 
 • అతిథులను తీసుకొచ్చే వాహనాలను తరుచూ క్రిమిసంహారకాలతో శుద్ధి చేయడం.


logo