శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 12, 2020 , 01:28:19

విపత్తు వేళ.. రికార్డుల హేళ

విపత్తు వేళ.. రికార్డుల హేళ

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించడమే కాదు.. ఆయా దేశాల శక్తిసామర్థ్యాలను సైతం ప్రపంచానికి చాటుతున్నది. విపత్తు వేళ ఆయా దేశాలు వాయువేగంతో అధునాతన దవాఖానలను నిర్మిస్తున్నాయి. చైనా కేవలం పదిరోజుల్లోనే వెయ్యి పడకల దవాఖానను నిర్మించి ఔరా అనిపించగా.. బ్రిటన్‌ సైతం తొమ్మిది రోజుల్లోనే దవాఖానను నిర్మించి అబ్బురపరిచింది. లండన్‌లోని డాక్లాండ్స్‌లో ఉన్న ఎక్సెస్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో దీన్ని నిర్మించారు. ఇందులో సుమారు 4 వేల మందికి చికిత్స అందించవచ్చని అక్కడి అధికారులు చెప్తున్నారు. మరోవైపు, రష్యా కూడా కరోనా బాధితుల కోసం భారీ దవాఖానను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నది. దాదాపు రూ.872 కోట్ల వ్యయంతో 106 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. 


logo