గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 26, 2020 , 04:32:57

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్‌ మృతి

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్‌ మృతి

కైరో: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ (91) మంగళవారం మరణించారని ఆ దేశ ప్రభుత్వ టీవీ ప్రకటించింది. అనారోగ్య సమస్యలతో దవాఖానలో చేరిన ఆయన కన్నుమూశారని తెలిపింది. ముబారక్‌ 30 ఏండ్లు ఈజిప్టు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో ముబారక్‌కు వ్యతిరేకంగా వేల మంది యువత 18 రోజుల పాటు ఆందోళనలు జరుపగా సైన్యం ఒత్తిడి మేరకు అదే ఏడాది ఫిబ్రవరి 11న అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 900 మంది మరణానికి కారణమయ్యారన్న అభియోగాలపై ఏప్రిల్‌లో అరెస్ట్‌ చేయగా 2012 జూన్‌లో దిగువ న్యాయస్థానం దోషిగా నిర్దారించి యావజ్జీవ ఖైదు విధించింది. 2014లో ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. అవినీతి ఆరోపణల కేసులో ముబారక్‌, ఆయన ఇద్దరు కొడుకులకు మూడేండ్ల జైలుశిక్ష పడగా 2017లో విడుదలయ్యారు.
logo
>>>>>>