శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Oct 01, 2020 , 16:19:12

మూతితో పియానో ప్లే చేసిన గుర్రం.. చూస్తే న‌వ్వు ఆపుకోలేరు!

మూతితో పియానో ప్లే చేసిన గుర్రం.. చూస్తే న‌వ్వు ఆపుకోలేరు!

గుర్రాన్ని చెరువు వ‌ద్ద‌కు తీసుకెళ్లొచ్చు కాని నీరు తాగించ‌లేం అనేది సామెత‌. వాటికి న‌చ్చితే ఏ ప‌నైనా చేస్తాయి. న‌చ్చ‌కుంటే ఎంత కొట్టినా చేయ‌వు. అయితే ఈ గుర్రానికి మాత్రం పియానో వాయించాల‌నిపించింది. కానీ ఎలా ప్లే చేయాలో తెలియ‌దు. మ‌నుషులు అయితే చేతితో వాయిస్తారు. దీనికి మూతే చేయి క‌దా. అందుకే మూతి ద్వారా పియానో ప్లే చేసింది. మూతిని అటూ ఇటూ క‌దిలిస్తూ భ‌లే నొక్కేంది. మ్యూజిక్ వ‌చ్చేకొద్ది మ‌రింత ఉత్సాహంగా ప్లే చేసింది. మ్యూజిక్ విన‌డానికి గుర్రానికి ఎలా ఉన్న‌దో ఏమో గాని మ‌న‌కి మాత్రం కాస్త క‌ష్టంగానే అనిపించ‌వ‌చ్చు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అయింది. ఇది ఏం సంగీతం అని ఆలోచించ‌కుండా గుర్రం ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకోవాలి. మ‌రి గుర్ర మ్యూజిక్‌ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి!