హాంకాంగ్, జూన్ 24: హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల పత్రిక, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి మద్దతిచ్చిన ‘ఆపిల్ డైలీ’ మూతబడింది. పత్రిక చివరి ఎడిషన్ గురువారం మార్కెట్లో విడుదలైన వెంటనే పాఠకులు ప్రతుల కోసం ఎగబడ్డారు. గంటల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. కాగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి అండగా నిలుస్తుందన్న కారణంతో ‘ఆపిల్ డైలీ’ సంపాదక వర్గం, ఉన్నత ఉద్యోగులను చైనా అరెస్టు చేసింది. ఆస్తులను స్తంభింపజేసింది. దీంతో ఎడిషన్ను మూసివేస్తున్నట్టు సంస్థ బుధవారం ప్రకటించింది.