బుధవారం 03 జూన్ 2020
International - May 02, 2020 , 10:53:02

నిర‌స‌న‌కారుల‌పై పెప్ప‌ర్ స్ర్పే

నిర‌స‌న‌కారుల‌పై పెప్ప‌ర్ స్ర్పే

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్‌లో నిర‌స‌న‌కారుల ప్ర‌ద‌ర్శ‌న‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు.  ఆందోళ‌న‌కారుల‌పై పెప్ప‌ర్ స్ప్రే చేశారు. మే డే సంద‌ర్భంగా నిర‌స‌న‌కారులు  ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు.  న‌లుగురి క‌న్నా ఎక్కువ మంది గుమ్మికూడ‌రాదు అని ఆదేశాలు ఉన్నా.. హాంగ్ కాంగ్ ప్ర‌జ‌లు రోడ్డెక్కారు.  గ్లోరీ టు హాంగ్ కాంగ్ అన్న పాట‌లు పాడారు.  న్యూ టౌన్ ప్లాజా మాల్ వ‌ద్ద వాళ్లు ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. సోష‌ల్ డిస్టాన్సింగ్ నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన ఆందోళ‌న‌కారుల‌పై పోలీసులు పెప్ప‌ర్ స్ప్రే చేశారు. గ‌త ఏడాది జూన్ నుంచి హాంగ్ కాంగ్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.  అప్ప‌గింత బిల్లును వ్య‌తిరేకిస్తూ వారి ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగుతున్నాయి.
logo