మంగళవారం 14 జూలై 2020
International - May 25, 2020 , 01:47:20

భగ్గుమన్న హాంకాంగ్‌

భగ్గుమన్న హాంకాంగ్‌

  • చైనా జాతీయభద్రతా చట్టంపై మళ్లీ చెలరేగిన నిరసనలు
  • బాష్ప వాయువు ప్రయోగం

హాంకాంగ్‌, మే 24: చైనా ప్రతిపాదించిన కఠిన ‘జాతీయ భద్రతా బిల్లు’పై హాంకాంగ్‌ వాసులు భగ్గుమన్నారు. ప్రజాస్వామ్య అనుకూలవాదులు ఆదివారం మధ్యాహ్నం చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. కరోనా నేపథ్యంలో ఎనిమిది మందికి మించి ఒకచోట చేరరాదన్న నిబంధనను ఉల్లంఘించి నిరసనకు దిగారని పేర్కొంటూ ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువు, నీటి ఫిరంగులు ప్రయోగించారు. సుమారు 120 మందిని అరెస్ట్‌చేశారు. నిరసనకారులు తమపై ఇటుకలు విసిరారని, గుర్తించని ద్రవం చల్లారని పోలీసులు ఆరోపించారు. అంతకుముందు భారీ సంఖ్యలో నిరసనకారులు నల్ల దుస్తులు ధరించి కాజ్‌వే బే జిల్లా వద్ద వేల మంది చేరుకున్నారు. చైనా ప్రతిపాదిత ‘భద్రతా చట్టానికి’ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ‘భద్రతాబిల్లు’ చట్టంగా మారితే స్వయంప్రతిపత్తి గల హాంకాంగ్‌లో వేర్పాటువాద, నిరసన కార్యకలాపాలతో పాటు, విదేశీ జోక్యంపై నిషేధం అమలులోకి వస్తుందని ప్రజాస్వామ్య అనుకూల వాదులు సందేహిస్తున్నారు. ఇది ఈ నెల 28న చట్టంగా మారుతుందన్న అంచనా నేపథ్యంలో హాంకాంగ్‌ వాసుల్లో ఆందోళన పెరుగుతున్నది. 


logo