మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 31, 2020 , 18:11:24

కరోనా ఎఫెక్ట్‌ : హాంగ్‌కాంగ్‌ శాసనమండలి ఎన్నికలు వాయిదా

కరోనా ఎఫెక్ట్‌ : హాంగ్‌కాంగ్‌ శాసనమండలి ఎన్నికలు వాయిదా

హాంగ్‌కాంగ్‌ : కరోనా విజృంభణ నేపథ్యంలో సెప్టెంబర్ 6న నిర్వహించాల్సిన హాంగ్‌కాంగ్‌ శాసనమండలి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) క్యారీ లామ్‌ శుక్రవారం ప్రకటించారు. ‘ఎన్నికలను వాయిదా వేయడం నిజంగా కఠినమైన నిర్ణయం. కానీ ప్రజాభద్రతా, ఆరోగ్యం అంతకంటే ముఖ్యమైనవి. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహిస్తాం. ప్రజల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని లామ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. గడిచిన కొన్ని వారాలుగా హాంగ్‌కాంగ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ దేశంలో ఇప్పటివరకు 3,151 కరోనా కేసులు నమోదు కాగా 25 మంది మృతి చెందారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది.  ఇద్దరి కంటే ఎక్కువ మంది గుమిగూడ వద్దని జులై 29న ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా సైతం విధిస్తోంది.    


logo