మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Feb 28, 2020 , 00:55:07

ఒక్కొక్కరికి 92,000!

ఒక్కొక్కరికి  92,000!

హాంకాంగ్‌, ఫిబ్రవరి 27: హాంకాంగ్‌ ప్రభు త్వం తమ ప్రజలకు భారీ నగదు కానుకను ప్రకటించింది. నెలల తరబడి సాగిన ఆందోళనలు, కరోనా వైరస్‌ విజృంభన నేపథ్యంలో మాంద్యంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఊపునిచ్చేందుకు ప్రతి శాశ్వత నివాసికి 10,000 హాంకాంగ్‌ డాలర్లను (దాదాపు రూ.92,000) అందజేయనున్నట్లు తెలిపింది. ఆర్థిక మంత్రి పాల్‌ చాన్‌ గురువారం వార్షిక బడ్జెట్‌ సందర్భంగా ఈ నగదు బహుమతిని ప్రకటించారు. 18 ఏండ్లు పైబడిన దాదాపు 70 లక్షల మందికి ఈ నగదును అందజేయనున్నారు. ఇందుకుగానూ 71 బిలియన్‌ హాంకాంగ్‌ డాలర్ల వ్యయం కానుంది. విదేశాల్లో నివసిస్తున్న వారికి కూడా ఈ కానుకను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పలు పన్ను ప్రయోజనాలను కూడా కల్పించింది. ఆర్థిక మాంద్యంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు  ఈ నిర్ణయం తీసుకున్నట్లు చాన్‌ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో హాంకాంగ్‌ గత 15 ఏండ్లలో తొలిసారి లోటు బడ్జెట్‌లోకి వెళ్లనుంది. 

logo