గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 21, 2020 , 01:01:36

భారతీయ ఇంటివైద్యానికి ఆక్స్‌ఫర్డ్‌ ఫిదా

భారతీయ ఇంటివైద్యానికి ఆక్స్‌ఫర్డ్‌ ఫిదా

  • దగ్గు, జలుబుకు తేనెతో మంచి ఫలితం 
  • ధ్రువీకరించిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ 

లండన్‌: భారతదేశంలో ఏ వ్యాధినైనా వంటగదే నయం చేస్తుందనే నమ్మకం వేల ఏండ్లనుంచి బలంగా ఉన్నది. నేటి అత్యాధునిక పరిశోధనలు కూడా దీన్ని  ధ్రువీకరిస్తున్నాయి. తాజాగా దగ్గు, జలుబుకు ఆయుర్వేదంలో ఉన్న తేనె వైద్యం అత్యంత సమర్థంగా పనిచేస్తుందని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. సాధారణంగా భారతీయుల ఇండ్లల్లో జలుబు, దగ్గు ఉన్నవారికి పరిగడుపున తేనె తినిపించటం పరిపాటే. ఈ వైద్యంపై ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ (యూఆర్‌టీఐ)ను తేనె తేలికగా నయం చేస్తుందని వెల్లడించారు. 

యాంటీబయాటిక్స్‌కు ప్రత్యామ్నాయం

వైరల్‌ వ్యాధుల నివారణలో వాడే యాంటీబయాటిక్‌ ఔషధాలకు తేనె సరైన ప్రత్యామ్నాయమని ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు తెలిపారు. ‘తేనె ఎక్కడైనా విరివిగా లభిస్తుంది. యాంటీబయాటిక్స్‌కు చవకైన ప్రత్యామ్నాయం. శరీరంలో సూక్ష్మజీవులను నిర్మూలించే రోగనిరోధకత స్థిరంగా విస్తరించేందుకు తేనె దోహదపడుతుంది’ అని  విశ్లేషించారు.

తాజావార్తలు


logo