మంగళవారం 19 జనవరి 2021
International - Dec 20, 2020 , 19:05:36

హెయిర్‌ కట్‌ చేయించుకోగానే కుటుంబానికి దగ్గరయ్యాడు..!

హెయిర్‌ కట్‌ చేయించుకోగానే కుటుంబానికి దగ్గరయ్యాడు..!

రియోడిజనీరో: అతడో నిరాశ్రయుడు. పదేళ్ల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు అతడు చనిపోయాడని అనుకుంటున్నారు. కానీ ఇటీవల ఓ వ్యాపారవేత్త చారిటీలో భాగంగా అతడిని చేరదీశాడు. అతడికి హెయిర్‌కట్‌ చేయించాడు. ఈ ఫొటోను సోషల్‌మీడియాలో పెట్టాడు. అంతే, సదరు నిరాశ్రయుడిని గుర్తించిన అతడి కుటుంబం ఆనందానికి అవధులు లేవు. చనిపోయాడనుకున్న ఇంటిపెద్ద బతికే ఉన్నాడని తెలుసుకొని వాళ్లు ఉబ్బితబ్బిబయ్యారు.  

 బ్రెజిల్‌కు చెందిన జోనో కోయెల్హో గుయిమారీస్ పదేళ్లనుంచి తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. అయితే, అతడు చనిపోయి ఉంటాడని కుటుంబం భావించింది. అప్పటినుంచి అతడు వీధులు పట్టుకుని తిరుగుతున్నాడు. చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, మెన్స్‌ ఫ్యాషన్‌ స్టోర్‌ యజమాని అలెశాండ్రో లోబోకు గుయిమారీస్‌ కనిపించాడు. ఏమైనా తినేందుకు కావాలా? అని అడిగితే అతడు సమాధానం చెప్పలేదు.  అయితే, గుయిమారీస్‌కు అలెశాండ్రో హెయిర్‌ కట్‌ చేశాడు. అతడికి షర్ట్స్‌, ప్యాంట్స్‌, జాకెట్‌, కొత్త షూస్‌ బహుమతిగా ఇచ్చాడు. దీనినుంచి మిగతావారు  కూడా స్ఫూర్తిపొందాలని  అతడి ఫొటోను ఇన్‌స్టాలో పెట్టాడు. ఆ ఫొటో వైరల్‌ అయి, గుయిమారీస్‌ కుటుంబ సభ్యులకు చేరింది. వారు ఈ నెల 17న వచ్చి అతడిని తీసుకెళ్లారు. క్రిస్మస్‌ సందర్భంగా ఒక జీవితాన్ని మార్చినందుకు తన జన్మధన్యమైందని అలెశాండ్రో ఆనందం వ్యక్తంచేస్తున్నాడు.

 ఇవి కూడా చదవండి..

రెండు దశల్లో నేపాల్‌ జాతీయ ఎన్నికలు

బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటిపోయింది

లఢక్‌ సరిహద్దులో కొత్త కమాండర్‌ను నియమించిన చైనా

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.