శనివారం 06 జూన్ 2020
International - Apr 11, 2020 , 12:11:28

క‌రోనాతో హాలివుడ్ న‌టి హిల్ల‌రీ మృతి

క‌రోనాతో హాలివుడ్ న‌టి హిల్ల‌రీ మృతి

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి మ‌రో సెలెబ్రిటీ మృతిచెందారు. బ్రిట‌న్‌కు చెందిన సైకాల‌జిస్టు, హాలీవుడ్ న‌టి హిల్లీరీ హీత్ (74) ఇటీవ‌ల క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యాన్ని ఆమె మ‌నుమ‌డు అలెక్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయ‌డంతో వెలుగులోకి వ‌చ్చింది. అయితే హాలీవుడ్ ప్ర‌ముఖులు శ‌నివారం అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. హిల్ల‌రీ ముఖేల్ రీవ్స్ హార్ర‌ర్ చిత్రం విచ్ ఫైండ‌ర్‌తో సినీరంగ ప్ర‌వేశం చేశారు. 

హిల్లరీ 1960, 1970 ద‌శ‌కాల్లో ప‌లు సినిమాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత 1990ల్లో ఆమె సినిమా నిర్మాణ‌రంగంలో అడుగుపెట్టారు. నిల్ బై మౌత్‌, యాన్ ఆవ్‌ఫుల్లీ అడ్వెంచ‌ర్ వంటి చిత్రాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. సినిమారంగంలోకి రాక‌ముందు హిల్ల‌రీ ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో సైకాల‌జీలో మాస్ట‌ర్ డిగ్రీ పూర్తిచేశారు. ఆ త‌ర్వాత వివిధ ఆస్ప‌త్రుల్లో అడిక్ష‌న్ కౌన్సెల‌ర్‌గా విధులు నిర్వ‌హించారు. అనంత‌రం సినిమా రంగంలోకి అడుగుపెట్టి హాలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo