సోమవారం 26 అక్టోబర్ 2020
International - Sep 22, 2020 , 12:30:42

ఆమె కారు వేగానికి ఒక‌రు బ‌లి.. తీరా చూస్తే అత‌ను ఆమె మామేన‌ట‌!

ఆమె కారు వేగానికి ఒక‌రు బ‌లి.. తీరా చూస్తే అత‌ను ఆమె మామేన‌ట‌!

ఏ జ‌న్మ‌లో చేసిన త‌ప్పు ఆ జ‌న్మ‌లోనే అనుభ‌విస్తారు అంటారు. అది నిజ‌మే. ఓ మ‌హిళ చేసిన త‌ప్పు ఈ జ‌న్మ‌లోనే అనుభ‌విస్తున్న‌ది. కొంచెం కూడా మాన‌వ‌త్వం లేక‌పోవ‌డ‌మే ఆమె చేసిన త‌ప్పు. ఇంత‌కీ ఏం చేసిందంటే.. 2018 ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఇంగ్లాండ్‌లోని లీసెష్ట‌ర్‌లో ఓ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. 29 ఏండ్ల ఫ‌తేహా భేగం బెదిన్ అనే ఓ మ‌హిళ ఫోన్ మాట్లాడుతూ వేగంగా కారు న‌డిపింది. స‌రిగ్గా జీబ్రాక్రాసింగ్ వ‌ద్ద ఓ వ్య‌క్తి రోడ్డు దాటుతున్నాడు. ఆ మ‌హిళ అత‌న్ని ప‌ట్టించుకోకుండా కారుతో ఢీ కొట్టింది.

క‌నీసం కారు ఆపి అత‌ని వైపు చూడ‌నేలేదు. పొగ‌రుతో ఆమె అక్క‌డి నుంచి ఎస్కేప్ అయింది. బెదిన్ ప‌రార్ అయినా సీసీకెమెరా మాత్రం వ‌దిలిపెట్ట‌దు క‌దా. ఆమె అక్క‌డి నుంచి వెళ్లిపోయిన త‌ర్వాత భ‌ర్త నుంచి ఫోన్ వ‌చ్చింది. మామ‌య్య‌కి యాక్సిడెంట్ అయింది అని చెప్పాడు. అంతేకాదు యాక్సిడెంట్ అయిన ప్ర‌దేశం కూడా చెప్పాడంతో ఆమెకు చెమ‌ట‌లు ప‌ట్టాయి. ఎందుకంటే ఆమె యాక్సిడెంట్ చేసింది త‌న భ‌ర్త తండ్రినే. మామయ్య హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విష‌యం కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌డానికి బెదిన్‌కు ధైర్యం స‌రిపోలేదు. 

ప‌గిలిన కారు అద్దాన్ని బాగు చేపించి ఎవ‌రికీ డౌట్ రాకుండా చేసింది. పోలీసులు మాత్రం సీసీకెమెరాలో రికార్డైంది కారును బ‌ట్టి ఒక వ్య‌క్తిని ప‌ట్టుకున్నాడు. మ‌రుస‌టి రోజుకు అత‌ను యాక్సిడెంట్ చేయ‌లేద‌ని తెలుసుకొని వ‌దిలిపెట్టేశారు. ఈ సారి మాత్రం యాక్సిడెంట్ చేసింది బెదిన్ అని పోలీసులు నిర్థారించుకున్నారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజ‌రుప‌రిచారు. బాధితులు మామ మాత్రం ఆమెను క్ష‌మించి వ‌దిలేయాల‌ని కోరాడు. కానీ చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకు పోవాల‌ని కోర్టు ఆమెకు 18 నెల‌ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు రెండేండ్ల పాటు కారు న‌డ‌ప‌కూడ‌ద‌ని వెల్ల‌డించారు. యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. logo