బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Sep 12, 2020 , 12:22:31

తాలిబ‌న్ల‌తో ఆఫ్ఘ‌నిస్తాన్ శాంతి చ‌ర్చ‌లు..

తాలిబ‌న్ల‌తో ఆఫ్ఘ‌నిస్తాన్ శాంతి చ‌ర్చ‌లు..

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌భుత్వం, తాలిబ‌న్ మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు ఇవాళ ప్రారంభంకానున్నాయి. కొన్ని నెలల పాటు ఈ చ‌ర్చ‌ల‌ను ఆల‌స్యం చేశారు. ఇవాళ దోహాలో ఈ చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.  చ‌ర్చ‌లు చ‌రిత్రాత్మ‌కం అంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కామెంట్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో అమెరికా, తాలిబ‌న్ మ‌ధ్య కుదిరిన సెక్యూర్టీ డీల్‌లో భాగంగా ఈ చ‌ర్చ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. వివాదాస్ప‌దంగా మారిన ఖైదీల అప్ప‌గిం‌త విష‌యంలో శాంతి చ‌ర్చ‌లు కొంత కాలం కుంటుప‌డ్డాయి. ఆఫ్ఘ‌న్ బృందానికి అబ్దుల్లా అబ్దుల్లా నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొన‌నున్న‌ట్లు తాలిబ‌న్ కూడా గురువారం ప్ర‌క‌ట‌న చేసింది. ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం, తాలిబ‌న్ మ‌ధ్య నేరుగా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. వాస్త‌వానికి ఇన్నాళ్లూ ప్ర‌భుత్వంతో క‌లిసేందుకు తాలిబ‌న్లు నిరాక‌రించారు.  ప్ర‌భుత్వానికి శ‌క్తి లేదు అని, అమెరికా కీలుబొమ్మ‌లంటూ తాలిబ‌న్లు ఆరోపించారు. అయితే ద‌శాబ్ధాల హింస‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల‌న్న ఉద్దేశంతో చ‌ర్చ‌లు ముందుకు సాగుతున్నాయి. 1979లో సోవియేట్ రాక‌తో ఆఫ్ఘ‌నిస్తాన్‌లో హింస ప్ర‌జ్వ‌రిల్లింది. ఆ త‌ర్వాత అమెరికా ప్ర‌వేశంతో ఆ హింస రెట్టింపు అయ్యింది. ప్ర‌స్తుతం శాంతి చ‌ర్చ‌లు ఆఫ్ఘ‌న్ ర‌క్త‌పాతాన్ని ఆపుతాయ‌న్న న‌మ్మ‌కం క‌లిగిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. 


 



logo