మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 06, 2020 , 04:05:11

విదేశాల్లోనూ సంబురాలు

విదేశాల్లోనూ సంబురాలు

వాషింగ్టన్‌: రామాలయ భూమిపూజ సందర్భంగా అమెరికాలో భారతీయులు వైభవంగా సంబురాలు చేసుకున్నారు. రాజధాని వాషింగ్టన్‌లో విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు భారీ ట్రక్కులపై డిజిటల్‌ తెరలు ఏర్పాటుచేసి ప్రతిపాదిత రామాలయం చిత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీలు తీశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో దీపాలు వెలిగించి రామాయణాన్ని పఠించారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌స్కేర్‌లో ఆలయ చిత్రాలను ప్రదర్శించారు.


logo