వేడుకలకు సిద్ధమైన పలు అమెరికా రాష్ర్టాలు
హ్యూస్టన్: టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఓహియో, మసాచుసెట్స్ సహా పలు అమెరికా రాష్ర్టాలు అక్టోబర్ నెలను హిందూ వారసత్వ నెలగా ప్రకటించాయి. హిందూమత ప్రత్యేక చరిత్ర, వారసత్వం అమెరికా అభివృద్ధికి ఎంతో దోహదం చేశాయని ఈ సందర్భంగా పేర్కొన్నాయి. అక్టోబర్ నెల అంతా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించేందుకొనేందుకు వివిధ హిందూ సంస్థలు సిద్ధమయ్యాయి. అమెరికా ప్రభుత్వం కూడా అక్టోబర్ నెలను హిందూ వారసత్వ మాసంగా గుర్తించాలని హిందూ సంస్థలు, సంఘాలు కోరుతున్నాయి. విశ్వహిందూ పరిషత్ అఫ్ అమెరికా, వరల్డ్ హిందూ కౌన్సిల్ ఆఫ్ అమెరికా, ఉత్తర అమెరికా హిందువుల కూటమి వంటి సంఘాలు హిందూ వారసత్వ సంపదను భావితరాలకు అందించేలా కార్యక్రమాలు రూపొందించే పనుల్లో నిమగ్నమయ్యాయి.