సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 05, 2020 , 01:48:04

నిరాశలో హిల్లరీ?!

నిరాశలో హిల్లరీ?!

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది ఫలితాలు ఇంకా వెలువడలేదు. అయితే, డెమోక్రాటిక్‌ పార్టీ నేత, సెనేటర్‌ హిల్లరీ క్లింటన్‌ చేసిన ఓ ట్విట్టర్‌ పోస్ట్‌ సంచలనంగా మారింది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌పై పోటీ చేసిన ఆమె పరాజయం పాలైన సంగతి తెలిసిందే. నాడు ఓటమిని అంగీకరిస్తూ ఆమె 2016, నవంబర్‌ 9న ఓ ట్వీట్‌ చేశారు. ‘ఓటమి వల్ల ఆత్మస్థెర్యాన్ని కోల్పోవద్దు’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, బుధవారం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడక ముందే నాలుగేండ్ల క్రితం చేసిన ట్వీట్‌ను మళ్లీ ఆమె రీ-పోస్టింగ్‌ చేయడం చర్చనీయాంశం అయింది. ప్రస్తుత ట్వీట్‌ ద్వారా ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల ఓటమిని ఆమె అంగీకరిస్తున్నారా? అని పలువురు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.