శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 29, 2020 , 16:21:26

ఇప్పుడు బిడెన్ నాయ‌క‌త్వం అవ‌స‌రంః హిల్ల‌రి

ఇప్పుడు బిడెన్ నాయ‌క‌త్వం అవ‌స‌రంః హిల్ల‌రి

క‌రోనా సంక్షోభంలో చిక్కుకున్న అమెరికాకు ఇప్పుడు జోబిడెన్ నాయ‌క‌త్వం అత్య‌వ‌స‌ర‌మ‌ని డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్‌పై పోటీచేసి ఓడిపోయిన హిల్ల‌రీ క్లింట‌న్ అన్నారు. వ‌చ్చే న‌వంబ‌ర్ 3న జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్రస్తుత అధ్య‌క్షుడు ట్రంప్ పై డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా జో బిడెన్ పోటీ చేస్తున్నారు. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని హిల్ల‌రీ మంగ‌ళ‌వారం సమ‌ర్థించారు. 

బిడెన్ గొప్ప నాయ‌కుడ‌ని కొనియాడారు. మీరు అధ్య‌క్షుడు కావ‌టానికి నేను సంపూర్ణంగా మ‌ద్ద‌తు తెలుపుతున్నాను. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో మీరే అధ్య‌క్షుడుగ ఉండాల‌ని కోరుకుంటున్నాను అని ఆమె ప్ర‌క‌టించారు. టీవీల ముందు న‌టించే వ్య‌క్తికాకుండా అస‌లైన అధ్య‌క్షుడు ఇప్పుడు అమెరికాకు కావాల‌ని ఆమె ప‌రోక్షంగా ట్రంప్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.   


logo