శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 09, 2020 , 18:29:58

అమ్మో.. ఈ బుడ‌త‌డు యాక్టింగ్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే!

అమ్మో.. ఈ బుడ‌త‌డు యాక్టింగ్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే!

సాధార‌ణంగా పిల్ల‌ల్ని ఎంత న‌వ్వించ‌నా ఒక్కోసారి న‌వ్వ‌రు. అదే వాళ్లు ఇత‌రుల‌ను న‌వ్వించ‌డానికి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. చిన్న యాక్టింగ్ చేస్తే చాలు. ఈ రోజుల్లో పిల్ల‌లు అయితే న‌టించ‌మంటే జీవించేస్తున్నారు. వారి యాక్టింగ్‌ను త‌ల్లి కూడా ప‌నిగ‌ట్ట‌లేదు. అంత‌లా మెప్పిస్తున్నారు. అలా ఈ బుడ‌త‌డు చేసిన ప‌నికి అంద‌రికి ఆనందాన్నిచ్చింది. 'నా కొడుకు ఫేకింగ్'‌ అనే శీర్షిక‌తో షేర్ చేసిన ఈ వీడియోను మాజీ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ రెక్స్ చాప్మ‌న్ రీట్వీట్ చేశారు. ఇప్పుడిది వైర‌ల్‌గా మారింది.

21 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో ఒక బుడ్డోడిని ఊయ‌ల ఊగ‌మ‌ని చెబుతుంది త‌ల్లి. చెప్పిన‌ట్లు గానే ఊయ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి రెండు స్లారు వ‌ట్టి ఊయ‌ల‌ను ఊపుతాడు. రెండోసారి ఊయ‌ల బుడ్డోడిని జ‌స్ట్ అలా తాక‌గానే ఏదో గ‌ట్టిగా త‌గిలిన‌ట్లుగా కింద‌ప‌డి దొర్లుతాడు. ఎవ‌రైనా చూస్తే అయ్యో.. చాలా గ‌ట్టిగా త‌గిలిన‌ట్లుందే అనుకుంటారు. అక్క‌డే ఉండి గ‌మ‌నించిన త‌ల్లి ఇక న‌వ్వు ఆపుకోలేక‌పోయింది. ఈ వీడియోను  2.6 మిలియ‌న్ల‌కు పైగా వీక్షించారు. 


logo