సోమవారం 06 జూలై 2020
International - Jun 08, 2020 , 08:16:26

ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం పాకిస్థాన్‌లో

ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం పాకిస్థాన్‌లో

ఇస్లామాబాద్‌: ములుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది పాకిస్థాన్‌ ఆర్థికపరిస్థితి. అసలే అస్తవ్యస్తంగా ఉన్న దాయాది దేశంలో ఆర్థికరంగం పరిస్థితి కరోనాతో మరింత దెబ్బతింది. ప్రస్తుత ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం మన పొరుగు దేశంలో నమోదైంది. పాకిస్థాన్‌ స్టేట్‌ బ్యాంక్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరి నెలలో 14.6 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. దీంతో ద్రవ్యోల్బణాన్ని తగ్గిచండానికి దేశ అత్యున్నత బ్యాంకు వడ్డీ రేటును 13.25 శాతం వరకు పెంచించింది. దీంతో రుణాలు తీసుకోవడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రాలేదు. తప్పనిసరిపరిస్థితుల్లో చేసేదేమీలేక వడ్డీ రేటును 5.5 శాతానికి తగ్గించింది.   


logo