శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 16:16:10

ల్యాండ్‌మైన్‌ల‌ను క‌నిపెట్టిన 'హీరో ఎలుక'.. బంగారు ప‌త‌కాన్ని గెలుచుకుంది!

ల్యాండ్‌మైన్‌ల‌ను క‌నిపెట్టిన 'హీరో ఎలుక'.. బంగారు ప‌త‌కాన్ని గెలుచుకుంది!

'మగవా' అనే ఆఫ్రిక‌న్ ఎలుక ల్యాండ్‌మైన్‌ల‌ను గుర్తించినందుకు బ్రిటిష్ వెట‌ర్న‌రీ ఛారిటీ పీపుల్స్ డిస్పెన్స‌రీ ఫ‌ర్ సిక్ యానిమ‌ల్స్ (పిడిఎస్‌ఎ) బంగారు ప‌త‌కాన్ని అందించింది. కొన్ని ద‌శాబ్దాల నుంచి ఆగ్నేయాసియా దేశాన్ని కొన్ని మిలియ‌న్ల ల్యాండ్‌మైన్లు, ఇత‌ర పేలుడు యుద్ద అవ‌శేషాల‌తో నిండిపోయింది. ఇప్ప‌టికీ ఇవి ప్ర‌తి ఏడాది డ‌జ‌న్ల కొద్దీ ప్ర‌జ‌ల‌ను పొట్ట‌న‌పెట్టుకుంటున్నాయి. ల్యాండ్‌మైన్ల‌ను క‌నిపెట్ట‌డం క‌ష్టంతో కూడుకున్న ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌ని. ఈ నేప‌థ్యంలో 'మగవా' అనే ఎలుక‌కు ప్ర‌భుత్వేత‌ర సంస్థ (యాంటీ-పర్సూన్స్మిజ్నెన్ ఓంట్మిజ్నెండే ప్రొడక్ట్ ఒంట్విక్కెలింగ్) ద్వారా శిక్ష‌ణ ఇచ్చారు. 

ల్యాండ్‌మైన్‌ల‌లో ఉప‌యోగించే పేలుడు ర‌సాయ‌నాల సువాస‌న‌ను గుర్తించ‌డానికి, వాటిని వారి హ్యాండ్ల‌ర్ల‌ను చూపించ‌డానికి 'మ‌గువా' వంటి ఎలుక‌ల‌కు బెల్జియంలోని టాంజానియా ప్ర‌దాన కార్యాల‌యం ఉన్న ఈ సంస్థ శిక్ష‌ణ ఇచ్చింది. 'మగవా' ఎలుక పెంపుడు ఎలుక క‌న్నా పెద్ద‌ది. ఇంకా తేలిగ్గా ఉంటే ల్యాండ్‌మైన్ మీద ఎప్ప‌టికీ న‌డ‌వ‌లేదు. 'మగవా' ఏడేండ్ల‌లో 39 ల్యాండ్‌మైన్‌లు, 28 పేలుడు బాంబుల‌ను క‌నుగొన్న‌ది. దాదాపు 35 ఎక‌రాల భూమిని క్లియ‌ర్ చేయ‌డానికి మగవా స‌హాయ‌ప‌డింది. పిడిఎస్‌ఎ ప్రకారం చారిటీకి బెస్ట్ పెర్ఫామ్మింగ్ ర్యాట్‌గా మగవాను గుర్తించింది. 

"మగవా ఒక హీరో ఎలుక. దీనికి పిడిఎస్ఎ బంగారు పతకాన్ని ప్రదానం చేయడం ద్వారా మగవా ప్రాణాలను రక్షించే భక్తిని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని పిడిఎస్ఎ డైరెక్టర్ జనరల్ జాన్ మెక్లౌగ్లిన్ మెడ‌ల్‌ వర్చువల్ ప్రెజెంటేషన్‌లో చెప్పారు. మగవా చిన్న‌త‌నం నుంచే శిక్ష‌ణ తీసుకున్న‌ది. మెట‌ర్ టిటెక్ట‌ర్ ఉప‌యోగించి టెన్నిస్ కోర్టు ప‌రిమాణాన్ని క్లియ‌ర్ చేయ‌డానికి మాన‌‌వుల‌కు నాలుగు రోజులు ప‌ట్టొచ్చు. కానీ మగవా మాత్రం కేవ‌లం 30 నిమిషాల్లో క్లియ‌ర్ చేస్తుంద‌ని పిడిఎస్‌ఎ చెప్పారు. logo