గురువారం 04 జూన్ 2020
International - May 05, 2020 , 15:27:05

హెప‌టైటిస్ సీ ఔష‌ధాల‌తో కోవిడ్‌19కు చికిత్స‌..

హెప‌టైటిస్ సీ ఔష‌ధాల‌తో కోవిడ్‌19కు చికిత్స‌..

హైద‌రాబాద్‌: హెపటైటిస్ సీ వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ కోసం వాడే వివిధ ర‌కాల ఔష‌ధాల‌ను.. కోవిడ్‌19 చికిత్స కోసం కూడా వాడ‌వ‌చ్చు అని జ‌ర్మ‌నీకి చెందిన జోహ‌న్నాస్ గుటెన్‌బ‌ర్గ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు తెలిపారు. సార్స్ సీఓవో-2ని అరిక‌ట్టేందుకు హెప‌టైటిస్ ఔష‌ధాన‌లు ప‌నిచేస్తాయ‌న్నారు. సూప‌ర్ కంప్యూట‌ర్ సిమ్యులేష‌న్స్ ద్వారా చేప‌ట్టిన‌ అధ్య‌య‌నం వ‌ల్ల ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.  సార్స్ సీఓవీ-2 ప్రోటీన్ల‌ను క‌ట్ట‌డి చేసే వివిధ ర‌కాల ఔష‌ధాల గురించి ప‌రిశోధ‌న‌లు జ‌రిపినట్లు తెలిపారు. హెప‌టైటిస్ డ్ర‌గ్స్ వ‌ల్ల క‌రోనా వైర‌స్ శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌దు అని, అది రెట్టింపు కాకుండా కూడా చూస్తుంద‌ని అన్నారు. 

హెడ్రాక్సీక్లోరోక్విన్‌, రెమ్‌డిసివిర్ ఔష‌ధాల ప‌నితీరుపై సీఎస్ఐఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ శేఖ‌ర్ స్పందించారు. రెండు ఔష‌ధాల‌ను పోల్చ‌వ‌ద్దు అని అన్నారు. ఆ రెండిటిని పోల్చ‌డం స‌రికాదు అని, ఎందుకంటే రెండు ఔష‌ధాలు ఎలా ప‌నిచేస్తున్నాయ‌న్న దానిపై పూర్తి క్లారిటీలేద‌న్నారు. కేవ‌లం ట్ర‌య‌ల్స్ త‌ర్వాత‌నే రెండింట్లో ఏది బెట‌ర్ అన్న విష‌యాన్ని నిర్ధారించ‌గ‌ల‌మ‌న్నారు.  logo