గురువారం 28 మే 2020
International - May 06, 2020 , 01:25:50

కరోనాకు హెపటైటిస్‌ సీ మందు!

కరోనాకు హెపటైటిస్‌ సీ మందు!

సూపర్‌ కంప్యూటర్‌ సిమ్యులేషన్లతో గుర్తించిన శాస్త్రవ్తేత్తలు

బెర్లిన్‌: హెపటైటిస్‌ సీ వ్యాధి చికిత్స కోసం ఆమోదించిన పలు మందులు కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఉపయోగపడుతాయని ఓ పరిశోధనలో తేలింది. జర్మనీలోని జోహన్నెస్‌ గుటెన్‌బర్గ్‌ యూనివర్సిటీ మెయిన్జ్‌ (జేజీయూ) పరిశోధకులు.. సూపర్‌ కంప్యూటర్‌ సిమ్యులేషన్లను ఉపయోగించి చేపట్టిన లెక్కల విధానంలో సార్స్‌ కొవిడ్‌-2 ప్రొటీన్లను బంధించే 42 వేల పదార్థాలను సిమ్యులేట్‌ చేశారు. హెపటైటిస్‌ సీ డ్రగ్‌లోని సిమెప్రివిర్‌, పరిటప్రివిర్‌, గ్రాజోప్రివిర్‌, వెల్‌పటస్విర్‌ సమ్మేళనాలు సార్స్‌ కొవిడ్‌-2 ఇన్‌ఫెక్షన్‌ను సమర్థంగా అడ్డుకోగలవని గుర్తించారు. ఈ గణాంక విధానం ల్యాబ్‌ పరిశోధనల కంటే తక్కువ ఖర్చు, ఎక్కువ వేగంగా పూర్తవుతుందని జేజీయూ ప్రొఫెసర్‌ థామస్‌ ఎఫ్ఫర్త్‌ తెలిపారు. 


logo