గురువారం 04 జూన్ 2020
International - Apr 29, 2020 , 22:24:52

మంత్రి కేటీఆర్‌ ట్విట్‌తో తెలంగాణవాసికి సహాయం

మంత్రి కేటీఆర్‌ ట్విట్‌తో తెలంగాణవాసికి సహాయం

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని చుట్టిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఆయా దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వలస కూలీలు, వేతన జీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో చిక్కుకుని తెలంగాణకు చెందిన రవితేజ అనే ఉద్యోగి కరోనా సృష్టించిన చిక్కుల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తనను ఆదుకోవాల్సిందిగా కోరుతూ మంత్రి కేటీఆర్‌, జాగృతి అధ్యక్షురాలు కవితను ట్విట్టర్‌ ద్వారా కోరాడు. స్పందించిన కేటీఆర్‌, కవిత బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా టీఆర్‌ఎస్‌ దక్షిణాఫ్రికాశాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజుకు సూచించారు. దీంతో గుర్రాల నాగరాజు స్వయంగా వెళ్లి రవితేజ కుటుంబానికి 15 రోజులకి సరిపడ నిత్యావసర సరుకులను అందజేశారు.logo