మంగళవారం 26 మే 2020
International - May 02, 2020 , 20:40:36

ఫ్రాన్స్‌లో హెల్త్ ఎమ‌ర్జెన్సీ జూలై 24వ‌ర‌కు పొడ‌గింపు

ఫ్రాన్స్‌లో హెల్త్ ఎమ‌ర్జెన్సీ జూలై 24వ‌ర‌కు పొడ‌గింపు

పారిస్: కరోనా నియంత్ర‌ణ‌లో భాగంగా ఫ్రాన్స్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో హెల్త్ ఎమర్జెన్పీని జూలై 24వరకు పొడిగిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓలివిర్ వీరన్ ఓ ప్రకటన చేశారు. మార్చి 24న విధించిన ఎమర్జెన్సీని ఈ నెలలో ఎత్తివేస్తే కరోనా వైరస్ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను  పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.  విదేశాల నుంచి ఫ్రాన్స్ కు వచ్చేవాళ్ల క్వారంటైన్ కండీషన్స్ గురించి కూడా ఈ బిల్లులో ప్ర‌స్తావిస్తామ‌ని వివ‌రించారు. కొంతకాలం పాటు మనం  వైరస్ తో జీవించాల్సిన పరిస్థితి ఉంద‌ని చెప్పారు. అటు మే 11నుంచి కొన్ని రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వాలని నిర్ణ‌యించింది. ఇప్పటివరకు ఫ్రాన్స్ లో 24,594 కరోనాతో మ‌ర‌ణించ‌గా 1,67,346 కరోనా కేసులు నమోదయ్యాయి. 50,212మంది  కరోనా నుంచి కోలుకున్నారు.


logo