గురువారం 04 జూన్ 2020
International - Apr 11, 2020 , 00:39:16

లాక్‌డౌన్‌ ఎత్తివేతలోతొందరొద్దు

లాక్‌డౌన్‌ ఎత్తివేతలోతొందరొద్దు

  • హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి పలు దేశాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్లను తొందరపాటుతో  ఎత్తివేస్తే తీవ్ర విపత్కారాలు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం వైరస్‌ కొంత కట్టడిలో ఉన్నదని, లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే అది మళ్లీ విజృంభించే అవకాశముందని తెలిపింది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. లాక్‌డౌన్‌ను విడుతల వారీగా సడలించుకుంటూ పోతే సరిపోతుందని, కానీ ఒక్కసారిగా ఎత్తివేయడం ప్రమాదకరమని హెచ్చరించింది.  కరోనా వైరస్‌ ‘సమూహ వ్యాప్తి’ దశలో ఉన్నదని గురువారం తన నివేదికలో పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. తాజాగా తన పొరపాటును సరిదిద్దుకున్నది. దేశంలో సమూహవ్యాప్తి లేదని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నదని తెలిపింది. 


logo