గురువారం 09 ఏప్రిల్ 2020
International - Feb 02, 2020 , 22:32:09

హార్వర్డ్‌ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్‌-2020.. కేటీఆర్‌కు ఆహ్వానం

హార్వర్డ్‌ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్‌-2020.. కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు మరో ప్రఖ్యాత కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఇంతకు ముందు కేటీఆర్ అనేక అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర అభ్యున్నతి, పెట్టుబడుల గురించి మాట్లాడారు. తాజాగా,  అమెరికా.. బోస్టన్‌లోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరగనున్న హర్వర్డ్‌ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్‌-2020లో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు. 17వ ఇండియా కాన్ఫరెన్స్‌-2020కి పలువురు కీలక వ్యక్తులకు ఆహ్వానం అందింది. వారిలో ప్రముఖులు కేటీఆర్‌. ఈ కాన్ఫరెన్స్‌కు హార్వర్డ్‌ యూనివర్సిటీ మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇరు దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. ‘భారతదేశంలో స్మార్ట్‌ సిటీలు’ అనే అంశంపై మంత్రి కేటీఆర్‌ ఈ సమావేశంలో మాట్లాడుతారు. 


logo