శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 17, 2020 , 03:48:38

బ్రిటన్‌ క్వీన్స్‌ కౌన్సెల్‌గా హరీశ్‌ సాల్వే!

బ్రిటన్‌ క్వీన్స్‌ కౌన్సెల్‌గా హరీశ్‌ సాల్వే!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాకిస్థాన్‌ అక్రమంగా నిర్బంధించిన భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) వేదికగా భారత్‌ తరఫున అద్భుతంగా వాదించి అందరి మన్ననలు పొందిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయనను ఇంగ్లండ్‌, వేల్స్‌ కోర్టుల్లో క్వీన్స్‌ కౌన్సెల్‌గా ఎంపిక చేశామని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ న్యాయశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. క్వీన్స్‌ కౌన్సెల్‌గా మార్చి 16న హరీశ్‌ సాల్వే బాధ్యతలను స్వీకరించనున్నారు. న్యాయవాద వృత్తిలో అత్యున్నత ప్రమాణాలు పాటించడంతోపాటు నైపుణ్యాలు, ప్రత్యేకతలు కల న్యాయవాదులు, ఉన్నత న్యాయస్థానాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన వారికి క్వీన్స్‌ కౌన్సెల్‌గా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ న్యాయశాఖ గుర్తింపును ఇస్తుంది.


logo