ఆదివారం 12 జూలై 2020
International - Jun 10, 2020 , 02:03:53

పోచారం ప్రాజెక్టుకు నీరిస్తాం... హరీశ్‌రావు

పోచారం ప్రాజెక్టుకు నీరిస్తాం... హరీశ్‌రావు

హవేళిఘనపూర్‌: కొండపోచమ్మ సాగర్‌ ద్వారా హల్దీవాగు నుంచి పోచారం ప్రాజెక్టు నింపి ఈ ప్రాంత రైతులకు సాగు నీటిని అందిస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం మెదక్‌ జిల్లా హవేళిఘనపూర్‌ మండలం రాజ్‌పేట వద్ద రూ.5.50 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్‌, టీడీపీ ప్రజాప్రతినిధులు ఈ వంతెన నిర్మాణం కోసం కొబ్బరికాయలు కొట్టి అలాగే వదిలేశారన్నారు. అన్ని ప్రాంతాలకు సాగు నీరందించి బీళ్లనుసాగులోకి తీసుకురావాలన్నదే సీఎం కేసీఆర్‌ కల అని,  రైతులు కూడా  ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారన్నారు. logo