బుధవారం 03 జూన్ 2020
International - May 22, 2020 , 11:59:16

‘భారత్‌ కు వెళ్లడం ఆనందంగా ఉంది..’

‘భారత్‌ కు వెళ్లడం ఆనందంగా ఉంది..’

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ 4.0 కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం విదేశాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి తీసుకొస్తోంది. కెనడాలోని టొరంటోలో ఉన్న భారతీయులు ప్రత్యేక విమానంలో బయలుదేరి రానున్నారు. ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ.. నా పేరు సోనాలి గోస్వామి టోరంటోలో పనిచేస్తున్నాను. నేను ఇండియాకు తిరిగెళ్తున్నా. మా కుటుంబసభ్యులను కలవనున్నందుకు సంతోషంగా ఉంది. నా చేతికి సర్జరీ అయింది. విపత్కర పరిస్థితుల్లో తనకు సహకరించి..స్వస్థలానికి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసిన భారత ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపింది.

నా పేరు ఫరా. మాది జమ్మూకశ్మీర్‌. టోరంటోలో ఉన్న నా సోదరిని కలిసేందుకు వచ్చి..కొన్ని రోజులుగా ఇక్కడే చిక్కుకునిపోయాను. భారత్‌కు పంపించేందుకు సహకరించిన కెనడా కాన్సులేట్‌ కార్యాలయం, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు  మరో ప్రయాణికురాలు వెల్లడించింది.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo