బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 30, 2020 , 13:48:26

బొమ్మ‌లోనే అమ్మ‌ను చూసుకుంటున్న మ‌హిళ‌..అందులో ఆమె వాయిస్ ఉంది!

బొమ్మ‌లోనే అమ్మ‌ను చూసుకుంటున్న మ‌హిళ‌..అందులో ఆమె వాయిస్ ఉంది!

కొన్నిరోజుల క్రితం కెన‌డాలోని వాంకోవ‌ర్‌లో మారా సోరియానో వెనుక త‌గిలించుకునే బ్యాగ్‌ను గుర్తు తెలియ‌ని మ‌నుషులు దొంగిలించారు. అందులో ఒక టెడ్డిబేర్ కూడా ఉంది. అన్నింటిక‌న్నా ఆ బొమ్మ చాలా విలువైన‌ది. పోయిన ఏడాది క్యాన్స‌ర్ కార‌ణంగా మ‌ర‌ణించిన త‌న త‌ల్లి వాయిస్ బొమ్మ‌లో రికార్డ్ చేసి ఉంది. దాన్ని ప్లే చేసిన‌ప్పుడ‌ల్లా అమ్మ వాయిస్ వినిపిస్తుంది. ఈ మాట‌లు వింటూ త‌న త‌ల్లి ఇంకా త‌న‌తోనే ఉన్న‌ట్లు ఆనంద‌ప‌డుతుంటుంది. దొంగ‌త‌నం వ‌ల్ల మారా త‌ల్లికి దూర‌మైంది.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ఈ టెడ్డీబేర్‌ను తీసుకొచ్చిన వారికి 5, 000 డాల‌ర్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ విజ్ఙ‌ప్తి బాగా వైర‌ల్ కావ‌డంతో న‌టుడు ర్యాన్ రేనాల్డ్స్ అకా డెడ్‌పూల్ కూడా ఈ మ‌హిళ‌కు సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు. కొన్నిరోజుల త‌ర్వాత మారా టెడ్డిబేర్‌ను తిరిగి పొందిన‌ట్లు ఆనందం వ్య‌క్తం చేసింది. "మామాబేర్ ఇంట్లో ఉంది'. 'దీని మీద ఎలాంటి మ‌చ్చ‌లు ప‌డ‌లేదు. రికార్డింగ్ కూడా అలానే ఉంది. చాలా సంతోషంగా ఉంది' అనే శీర్షిక‌తో ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. త‌ల్లి మ‌ర‌లా మారా చెంత‌కు చేరింద‌ని నెటిజ‌న్లు ఆనంద‌ప‌డ్డారు. logo